అఫ్రిది పోయాడంటూ సోషల్ మీడియాలో వైరల్ న్యూస్... అసలు విషయం ఇదే!

  • పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరణించినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్
  • ఫ్యాక్ట్ చెక్ చేస్తే అది ఫేక్ వీడియోగా తేలిన వైనం
  • ఏఐ తో వీడియోను సృష్టించారని స్పష్టం చేసిన ఫ్యాక్ట్ చెక్ టీమ్
సోషల్ మీడియాతో పాటు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ వార్త నిజమో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరణించారంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక పాకిస్థాన్ న్యూస్ యాంకర్ అఫ్రిది మరణించినట్లు ప్రకటిస్తున్నట్లుగా ఉంది. అయితే దీనిపై ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా అది సత్యదూరమని తేలింది.

ఆ వీడియోలోని చిత్రాలు, ఇతరత్రా అంశాలను ఏఐ ద్వారా సృష్టించినట్లు గుర్తించారు. వాస్తవానికి షాహిద్ అఫ్రిది ఆరోగ్యంగానే ఉన్నారని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అవాస్తవమని ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. 

Shahid Afridi
Shahid Afridi death
Pakistan cricket
Fake news
Social media
Artificial Intelligence
AI generated video
Fact check
Viral video

More Telugu News